రవ్వ అప్పాలు

ABN , First Publish Date - 2020-08-08T21:41:13+05:30 IST

బొంబాయి రవ్వ - 1 కప్పు, పంచదార - ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా.

రవ్వ అప్పాలు

కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - 1 కప్పు, పంచదార - ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా. 


తయారుచేసే విధానం: ఒక బౌల్‌లో పంచదార, యాలకుల పొడి, వేగించిన రవ్వ వేసి బాగా కలపాలి. కప్పు నీటిని బాగా మరిగించి రవ్వ మిశ్రమం పోస్తూ ఉండలు చుట్టకుండా కలుపుతూ ఉడికించి ముద్దగా చేయాలి. దించేశాక, చల్లారిన తర్వాత చేత్తో (బొమ్మలో మాదిరి) అప్పాలుగా ఒత్తి నూనెలో వేగించి, లోపలి నూనె ఒత్తి తీసెయ్యాలి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయివి. 


Updated Date - 2020-08-08T21:41:13+05:30 IST