పెసర్ల సలాడ్‌

ABN , First Publish Date - 2020-03-07T17:34:32+05:30 IST

వెజిటబుల్‌ స్టాక్‌ - ఆరు కప్పులు, పెసర్లు - అరకేజీ, జీలకర్ర - టేబుల్‌స్పూన్‌, పసుపు - టీస్పూన్‌, ధనియాలు - రెండు టీస్పూన్లు, యాలకులు

పెసర్ల సలాడ్‌

కావలసినవి: వెజిటబుల్‌ స్టాక్‌ - ఆరు కప్పులు, పెసర్లు - అరకేజీ, జీలకర్ర - టేబుల్‌స్పూన్‌, పసుపు - టీస్పూన్‌, ధనియాలు - రెండు టీస్పూన్లు, యాలకులు - నాలుగైదు, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయలు - రెండు, నెయ్యి - టేబుల్‌స్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, అల్లం - చిన్నముక్క, క్యారెట్‌ - నాలుగు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌,  కొత్తిమీర - కట్ట, పాలకూర - కట్ట, నిమ్మకాయ - ఒకటి.


తయారీ:

* పెసర్లను కాసేపు నానబెట్టి 20 నిమిషాల పాటు చిన్నమంటపై ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

* ఒక పాన్‌ తీసుకొని స్టవ్‌పై పెట్టి ధనియాలు, జీలకర్ర వేగించుకొని పక్కన పెట్టాలి. అదే పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి మరి కాసేపు వేగనివ్వాలి.

* ఉడికించి పెట్టుకున్న పెసర్లు, క్యారెట్‌ ముక్కలు వేసి కలపాలి. 

* తగినంత ఉప్పు మిరియాల పొడి వేయాలి. చిన్న మంటపై వేగినివ్వాలి. 

* పాలకూర వేయాలి. కొత్తిమీర తరిగి వేసుకోవాలి. మరికాసేపు వేగిన తరువాత నిమ్మరసం పిండుకొని దింపాలి.

* వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఈ సలాడ్‌ దోహదపడుతుంది.

Updated Date - 2020-03-07T17:34:32+05:30 IST