చిలగడదుంప సలాడ్
ABN , First Publish Date - 2020-03-07T17:54:45+05:30 IST
చిలగడదుంపలు (స్వీట్ పొటాటో) - మూడు, ఉల్లిపాయ - ఒకటి, కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ - సరిపడా, బ్లాక్ బీన్స్ - అరకప్పు, సల్సా సాస్ - అరకప్పు, వెజిటబుల్ స్టాక్ -
కావలసినవి: చిలగడదుంపలు (స్వీట్ పొటాటో) - మూడు, ఉల్లిపాయ - ఒకటి, కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ - సరిపడా, బ్లాక్ బీన్స్ - అరకప్పు, సల్సా సాస్ - అరకప్పు, వెజిటబుల్ స్టాక్ - రెండు కప్పులు, నీళ్లు - రెండు కప్పులు, కారం - ఒక టేబుల్‌స్పూన్, జీలకర్ర, - ఒక టీస్పూన్, దాల్చినచెక్క - కొద్దిగా, కొత్తిమీర - ఒక కట్ట, నిమ్మకాయ - ఒకటి.
తయారీ:
* ఒక పాత్రను తీసుకొని స్టవ్‌పై పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి.
* కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేయాలి.
* తరువాత చిలగడదుంపలను ముక్కలుగా కట్ చేసి వేసి కలపాలి.
* జీలకర్ర, దాల్చిన చెక్క వేయాలి.
* కాసేపయ్యాక సల్సా, వెజిటబుల్ స్టాక్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి.
* చిన్నమంటపై కాసేపు ఉడికించిన తరువాత బ్లాక్ బీన్స్ వేయాలి. కారం వేసి కలపాలి. అరగంటపాటు ఉడికించుకోవాలి.
* కొత్తిమీరతో గార్నిష్ చేసి, నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవాలి.