థండయ్
ABN , First Publish Date - 2020-04-27T16:52:10+05:30 IST
నీరు - ఒక కప్పు, పంచదార - తీపికి సరిపడా, పుచ్చకాయ గింజలు - 2 టేబుల్ స్పూన్లు, ఎండిన గులాబి రేకులు - పావు కప్పు, పాలు - అర లీటరు, బాదం - 10, గసగసాలు - ఒక టేబుల్ స్పూను, గ్రీన్ యాలకులు - అర టీ స్పూను, మిరియాలు - ఒక టీ స్పూను, సోంపు - 100 గ్రా., కుంకుమపువ్వు - 4 కాడలు.
కావలసిన పదార్థాలు: నీరు - ఒక కప్పు, పంచదార - తీపికి సరిపడా, పుచ్చకాయ గింజలు - 2 టేబుల్ స్పూన్లు, ఎండిన గులాబి రేకులు - పావు కప్పు, పాలు - అర లీటరు, బాదం - 10, గసగసాలు - ఒక టేబుల్ స్పూను, గ్రీన్ యాలకులు - అర టీ స్పూను, మిరియాలు - ఒక టీ స్పూను, సోంపు - 100 గ్రా., కుంకుమపువ్వు - 4 కాడలు.
తయారుచేసే విధానం: ఒక కప్పు నీటిలో గసగసాలు, సోంపు, పుచ్చగింజలు వేసి అరగంట నానబెట్టాలి. వీటితోపాటు ఒక రాత్రి నానబెట్టిన బాదం కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పాలను మరిగించి కుంకుమపువ్వు వేయాలి. ఇప్పుడు పంచదార వేసి కలపాలి. గులాబి రేకులు, మిరియాలు, సోంపు కలిపి పౌడరు చేయాలి. పాలల్లో బాదం పేస్టు, మిరియాల మిశ్రమం, యాలకుల పొడి వేసి 3 నిమిషాలు మరిగించి దించేయాలి. చల్లారిన తర్వాత ఫ్రిజ్లో 3 గంటలు ఉంచాలి. సర్వ్ చేసేముందు బాదం తరుగు, గులాబి రేకులతో అలంకరించాలి.