గోంగూర రొయ్యల కర్రీ

ABN , First Publish Date - 2020-02-01T20:27:12+05:30 IST

రొయ్యలు - అరకేజీ, గోంగూర - రెండు కట్టలు, పచ్చిమిర్చి - ఆరు, పసుపు - చిటికెడు, ఉల్లిపాయ - ఒకటి, ఆవాలు - అర టీస్పూన్‌, నూనె - సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌

గోంగూర రొయ్యల కర్రీ

కావలసినవి : రొయ్యలు - అరకేజీ, గోంగూర - రెండు కట్టలు, పచ్చిమిర్చి - ఆరు, పసుపు - చిటికెడు, ఉల్లిపాయ - ఒకటి, ఆవాలు - అర టీస్పూన్‌, నూనె - సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, గరం మసాలా - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారీ : పాన్‌ తీసుకొని కాస్త నూనె వేసి, వేడి అయ్యాక పచ్చి మిర్చి, గోంగూర ఆకులు వేసి ఉడికించాలిగోంగూర ఉడికిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. బాగా మెత్తగా కావాలనుకుంటే మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవచ్చు.తరువాత అదే పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, ఉల్లిపాయ వేసి వేగించాలి. ఉల్లిపాయలు వేగాక పసుపు,అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేయాలి.ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి కలిపి మరికాసేపు వేగనివ్వాలి.చివరగా గోంగూర పేస్టు వేసి కలపాలి. మరికాసేపు ఉడికించి దించాలి. అన్నంతో లేదా చపాతీతో గోంగూర రొయ్యల కూర తింటే రుచిగా ఉంటుంది. .


Updated Date - 2020-02-01T20:27:12+05:30 IST