బొమ్మిడాయిల పులుసు

ABN , First Publish Date - 2020-06-06T18:19:03+05:30 IST

గోంగూర - రెండు కట్టలు, బొమ్మిడాయిలు - పావు కేజీ, ఉల్లిపాయ - ఒకటి, ఆవాలు - పావు టీస్పూన్‌, జీలకర్ర - పావు టీస్పూన్‌, మెంతులు - పావు టీస్పూన్‌, పచ్చిమిర్చి - నాలుగైదు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, పసుపు -

బొమ్మిడాయిల పులుసు

కావలసినవి: గోంగూర - రెండు కట్టలు, బొమ్మిడాయిలు - పావు కేజీ, ఉల్లిపాయ - ఒకటి, ఆవాలు - పావు టీస్పూన్‌, జీలకర్ర - పావు టీస్పూన్‌, మెంతులు - పావు టీస్పూన్‌, పచ్చిమిర్చి - నాలుగైదు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, గరం మసాలా - ఒక టీస్పూన్‌, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా. 


తయారీ: గోంగూరను మిక్సీలో వేసి పేస్టు చేయాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయలు వేయాలి. వెల్లుల్లి రెబ్బలు వేయాలి. తగినంత ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి. కాస్త వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. 

పసుపు, ధనియాల పొడి, తగినంత కారం, జీలకర్రపొడి, గరంమసాలా వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోయాలి. ఉడుకుతున్న సమయంలో గోంగూర పేస్టు వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు బొమ్మిడాయిల ముక్కలు వేసి చిన్నమంటపై ఉడికించాలి. బొమ్మిడాయిలు ఉడికిన తరువాత వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2020-06-06T18:19:03+05:30 IST