చికెన్ రోస్ట్
ABN , First Publish Date - 2020-07-18T17:09:02+05:30 IST
చికెన్ - ఒకకేజీ, ఉల్లిపాయలు - రెండు, ఎండుమిర్చి - పది, ధనియాలు - రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు,
కావలసినవి: చికెన్ - ఒకకేజీ, ఉల్లిపాయలు - రెండు, ఎండుమిర్చి - పది, ధనియాలు - రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, జీలకర్ర - టీస్పూన్, పసుపు - టీస్పూన్, నూనె - సరిపడా, సాజీర - అర టీస్పూన్, లవంగాలు - ఆరు, దాల్చిన చెక్క - కొద్దిగా, యాలకులు - నాలుగు, మిరియాలు - టీస్పూన్, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట.
తయారీ: స్టవ్‌పై పాన్ పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి. ఉల్లిపాయలు బాగా వేగాక పసుపు వేసి కలపాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కలియబెట్టాలి. మూత పెట్టి చిన్నమంటపై ఉడికించాలి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగించాలి. అన్నీ వేగిన తరువాత మిరియాలు, సాజీర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేయాలి. కాసేపయ్యాక అన్ని పదార్థాలను, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి పొడి చేయాలి. ఉడుకుతున్న చికెన్‌లో ఈ మసాలా వేయాలి. తగినంత ఉప్పు వేసి కలపాలి. నీళ్లు పోయకూడదు. మూత పెట్టి చిన్నమంటపై పదినిమిషాలపాటు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. మంచి రంగు కోసం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. చివరగా కరివేపాకు, కొత్తిమీర వేసి మరి కాసేపు ఫ్రై చేసి దింపితే చికెన్ రోస్ట్ రెడీ. అన్నం లేదా రోటీతో చికెన్ రోస్ట్ రుచిగా ఉంటుంది.