సింపుల్‌ ఫిష్‌ కర్రీ

ABN , First Publish Date - 2020-07-05T17:41:20+05:30 IST

చేప ముక్కలు - అరకేజీ, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 4, నూనె - 6 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌ స్పూను, పసుపు - అర టీ స్పూను, టమోటా తరుగు - అరకప్పు,

సింపుల్‌ ఫిష్‌ కర్రీ

కావలసిన పదార్థాలు: చేప ముక్కలు - అరకేజీ, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 4, నూనె - 6 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌ స్పూను, పసుపు - అర టీ స్పూను, టమోటా తరుగు - అరకప్పు, చింతపండు గుజ్జు - అరకప్పు, కారం, ధనియాల పొడి - 1 టేబుల్‌ స్పూను చొప్పున, నీరు - రెండు కప్పులు, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర - అరకప్పు; పొడికోసం : ధనియాలు - 1  స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 8, మెంతులు - అర స్పూను, ఎండుమిర్చి - 6.


తయారుచేసే విధానం: మిక్సీలో ఉల్లి, పచ్చిమిర్చి పేస్టు చేసుకోవాలి. నూనెలో ఉల్లి పేస్టు వేగించి కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి, పసుపు, టమోటా తరుగు, కారం, ధనియాల పొడి ఒకటి తర్వాత ఒకటి వేగించి చింతపండు గుజ్జు కలపాలి. తర్వాత నీరుపోసి మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేయాలి. పులుసు చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్‌ చేయాలి.

Updated Date - 2020-07-05T17:41:20+05:30 IST