తలకాయ కూర

ABN , First Publish Date - 2020-07-18T17:37:50+05:30 IST

మేక తలకాయ మాంసం - ఒక కేజీ, ఉల్లిపాయలు - రెండు, కారం - నాలుగు టీస్పూన్లు, కొబ్బరి పొడి - మూడు టీస్పూన్లు, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి

తలకాయ కూర

కావలసినవి: మేక తలకాయ మాంసం - ఒక కేజీ, ఉల్లిపాయలు - రెండు, కారం - నాలుగు టీస్పూన్లు, కొబ్బరి పొడి - మూడు టీస్పూన్లు, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, వెల్లుల్లి రెబ్బలు - ఐదారు,  పసుపు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, లవంగాలు - ఎనిమిది, సాజీర - అర టీస్పూన్‌, మిరియాలు - అరటీస్పూన్‌, దాల్చిన చెక్క - కొద్దిగా, యాలకులు - నాలుగు, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ: ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. మిక్సీలో కొద్దిగా ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాల పొడి, కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు, సాజీర వేసి మెత్తగా పేస్టులా చేయాలి. స్టవ్‌పై కుక్కర్‌ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి.

కాసేపు వేగిన తరువాత పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. ఇప్పుడు తలకాయ మాంసం వేసి మూత పెట్టి చిన్నమంటపై పది నిమిషాలు ఉడికించాలి. తరువాత తయారుచేసి పెట్టుకున్న మసాలా పేస్టు వేయాలి. బాగా కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.

తగినంత కారం, ఉప్పు వేసి కలియబెట్టాలి. మాంసం ఉడకడానికి తగినన్ని నీళ్లు పోయాలి. కుక్కర్‌ మూత పెట్టి ఆరు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పోయాక మూత తీయాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి

Updated Date - 2020-07-18T17:37:50+05:30 IST