మటన్‌ లుక్మీ

ABN , First Publish Date - 2020-11-07T17:35:18+05:30 IST

మటన్‌ కీమా - 200గ్రా, ఉల్లిపాయలు - 20గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు - 10గ్రా, కారం - 15గ్రా, ధనియాల పొడి - 50గ్రా, గరంమసాలా - 5గ్రా, పసుపు - 5గ్రా, నూనె - 400ఎంఎల్‌, మైదా - 100గ్రా

మటన్‌ లుక్మీ

కావలసినవి: మటన్‌ కీమా - 200గ్రా, ఉల్లిపాయలు - 20గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు - 10గ్రా, కారం - 15గ్రా, ధనియాల పొడి - 50గ్రా, గరంమసాలా - 5గ్రా, పసుపు - 5గ్రా, నూనె - 400ఎంఎల్‌, మైదా - 100గ్రా, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - 15గ్రా, నెయ్యి లేదా డాల్డా - 25గ్రా.


తయారీ విధానం: మటన్‌ కీమాలో అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి మారినేట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. తరువాత మారినేట్‌ చేసుకున్న మటన్‌ వేసి చిన్నమంటపై ఉడికించాలి. ధనియాల పొడి, గరంమసాల చల్లి దింపాలి. ఇప్పుడు ఒక పాత్రలో మైదాపిండి తీసుకుని అందులో నెయ్యి, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలిపి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ వెడల్పుగా ఒత్తుకోవాలి. మధ్యలో మటన్‌ మిశ్రమం పెట్టి మరో లేయర్‌తో మూసేయాలి. నీళ్లు అద్దుతూ చివరలు మూయాలి. వీటిని చిన్నమంటపై నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడిగా తింటే మటన్‌ లుక్మీ రుచిగా ఉంటుంది.


మటన్‌లో..

క్యాలరీలు 234

ఫ్యాట్‌ 11గ్రా

ప్రొటీన్‌ 33గ్రా

కార్బోహైడ్రేట్లు 0.1గ్రా


విక్రమ్‌ సింహ

కార్ప్ చెఫ్‌, ఓహ్రిస్‌


Updated Date - 2020-11-07T17:35:18+05:30 IST