వంజరం వేపుడు

ABN , First Publish Date - 2020-06-06T18:12:25+05:30 IST

వంజరం చేప - పావు కేజీ, కరివేపాకు - కొద్దిగా, నూనె - సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నిమ్మకాయ

వంజరం వేపుడు

కావలసినవి: వంజరం చేప - పావు కేజీ, కరివేపాకు - కొద్దిగా, నూనె - సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నిమ్మకాయ - ఒకటి, కారం - అర టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌.


తయారీ: ముందుగా చేపను శుభ్రం చేసుకోవాలి. ఒక బౌల్‌లో అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, గరంమసాలా, కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కరివేపాకు వేసి వేగించాలి. తరువాత మసాలా పట్టించిన చేప ముక్కలు వేసి చిన్నమంటపై కాసేపు వేగనివ్వాలి. కాసేపయ్యాక నెమ్మదిగా చేప ముక్కలు మరో వైపు తిప్పి మరికాసేపు ఫ్రై కానివ్వాలి. చేప ముక్కలు రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక నిమ్మరసం పిండుకొని దించాలి. వంజరం వేపుడు చపాతీలోకి లేదా అన్నంలోకి రుచిగా ఉంటుంది.

Updated Date - 2020-06-06T18:12:25+05:30 IST