ఉసిరి చట్నీ
ABN , First Publish Date - 2020-11-28T21:25:53+05:30 IST
ఉసిరికాయలు - ఒక కప్పు, నూనె - సరిపడా, సోంపు - ఒక టేబుల్‌స్పూన్, ధనియాల పొడి - ఒక టీస్పూన్, కారం - ఒక టీస్పూన్, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు - రుచికి తగినంత.
కావలసినవి: ఉసిరికాయలు - ఒక కప్పు, నూనె - సరిపడా, సోంపు - ఒక టేబుల్‌స్పూన్, ధనియాల పొడి - ఒక టీస్పూన్, కారం - ఒక టీస్పూన్, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు - రుచికి తగినంత.
తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను ఉడికించి, విత్తనాలు తీసేయాలి. తరువాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక సోంపు వేసి వేగించాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేయాలి. ధనియాల పొడి, కారం, నెయ్యి వేసి కలియబెట్టి మరికాసేపు వేగించాలి. తగినంత ఉప్పు వేసి కలుపుకొని స్టవ్‌పై నుంచి దింపాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే టేస్టీ ఉసిరికాయ చట్నీ రెడీ.