వంకాయ పెరుగు పచ్చడి
ABN , First Publish Date - 2020-06-15T16:53:35+05:30 IST
పెద్ద వంకాయ - 1, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 4, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్ స్పూన్లు,
కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయ - 1, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 4, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 2, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు - తిరగమోత కోసం, కరివేపాకు - 4 రెబ్బలు, పుల్లటి పెరుగు - 400 గ్రా., మిరియాలు - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - గుప్పెడు, పసుపు - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: ముందుగా వంకాయకు కత్తితో గాట్లు పెట్టి నూనె రాసి కాల్చుకోవాలి. చల్లారిన తర్వాత పై చెక్కుతో పాటు లోపలి గింజలుకూడా తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, తిరగమోత గింజలు, కరివేపాకు, పసుపు వేగించి వంకాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు చిన్నమంటపై మగ్గించి దించేయాలి. తర్వాత చిలికిన పెరుగులో దంచిన మిరియాలు, కొత్తిమీరతో పాటు వేసి బాగా కలపాలి.