నువ్వుల పచ్చడి

ABN , First Publish Date - 2020-09-05T20:11:47+05:30 IST

నువ్వులు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - ఆరు, ధనియాలు - అరస్పూన్‌, మెంతులు - ఆరు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, చింతపండు - నిమ్మకాయంత

నువ్వుల పచ్చడి

కావలసినవి: నువ్వులు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - ఆరు, ధనియాలు - అరస్పూన్‌, మెంతులు - ఆరు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, చింతపండు - నిమ్మకాయంత, బెల్లం - కొద్దిగా, నూనె - రెండు టీస్పూన్లు, ఆవాలు - అరస్పూన్‌, ఎండుమిర్చి - ఒకటి.


తయారీ విధానం: ముందుగా నువ్వులు దోరగా వేగించాలి. ధనియాలు, మెంతులు వేగించుకోవాలి. చింతపండును నీళ్లలో నానబెట్టాలి. నువ్వులను పొడి చేసుకోవాలి. తరువాత ధనియాలు, మెంతులు వేసి పొడి చేయాలి. నానబెట్టిన చింతపండు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ గ్రైండ్‌ చేయాలి. ఇప్పుడు స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు వేయాలి. తియ్యగా ఉండాలని కోరుకునే వాళ్లు బెల్లం కలపవచ్చు.


వందగ్రాముల నువ్వుల్లో...

క్యాలరీలు - 573

కార్బోహైడ్రేట్లు - 23 గ్రా

డైటరీ ఫైబర్‌ - 12 గ్రా

ప్రొటీన్‌ - 18 గ్రా


ఇంకా విటమిన్లు, క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం మైక్రోగ్రాముల్లో లభిస్తాయి. నువ్వులు తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి. శ్వాస సమస్యలు దూరమవుతాయి. గుండెకు చాలా మేలు జరుగుతుంది. ఇవి ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడతాయి. 


Updated Date - 2020-09-05T20:11:47+05:30 IST