మాడు వాసన పోవాలంటే...

ABN , First Publish Date - 2020-05-30T17:26:49+05:30 IST

ఇంటిల్లిపాది కోసం ఇష్టంగా వండిన బిర్యానీ ఒక్కోసారి కుక్కర్‌ అడుగున మాడిపోతుంది. అలాంటప్పుడు పెద్ద ఉల్లిపాయతో మాడు వాసన పోగొట్టవచ్చు అంటున్నారు మాస్టర్‌ చెఫ్‌ పంకజ్‌ భదౌరియా.

మాడు వాసన పోవాలంటే...

ఆంధ్రజ్యోతి(30-05-2020)

ఇంటిల్లిపాది కోసం ఇష్టంగా వండిన బిర్యానీ ఒక్కోసారి కుక్కర్‌ అడుగున  మాడిపోతుంది. అలాంటప్పుడు పెద్ద  ఉల్లిపాయతో మాడు వాసన పోగొట్టవచ్చు అంటున్నారు మాస్టర్‌ చెఫ్‌ పంకజ్‌ భదౌరియా. 

పెద్ద ఉల్లిపాయను పొట్టు తీయకుండానే నాలుగు పెద్ద ముక్కలుగా కోసి కుక్కర్‌లోని బిర్యానీలో నాలుగు చోట్లా పెట్టాలి. 

కుక్కర్‌ మీద మూత పెట్టి 10-15 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి.

ఇప్పుడు మూత తీసి ఉల్లిపాయ ముక్కలను తీసెయ్యాలి. అప్పటికే సగానికి పైగా ఉడికిన ఉల్లిపాయ ముక్కలు బిర్యానీ మాడు వాసనను పూర్తిగా పీల్చుకుంటాయి. 

దాంతో బిర్యానీ రుచికరంగా ఉంటుంది.

Updated Date - 2020-05-30T17:26:49+05:30 IST