ఉసిరి కొబ్బరి కర్రీ

ABN , First Publish Date - 2020-11-28T21:35:23+05:30 IST

ఉసిరికాయలు - ఆరు, పచ్చి కొబ్బరి - అరకప్పు, గసగసాలు - మూడు టీస్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, తరిగిన అల్లం - కొద్దిగా, పసుపు - పావు టీస్పూన్‌, కరివేపాకు

ఉసిరి కొబ్బరి కర్రీ

కావలసినవి: ఉసిరికాయలు - ఆరు, పచ్చి కొబ్బరి - అరకప్పు, గసగసాలు - మూడు టీస్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, తరిగిన అల్లం - కొద్దిగా, పసుపు - పావు టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - రుచికి సరిపడా, కారం - తగినంత, నూనె - సరిపడా, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను నూనెలో మగ్గపెట్టుకోవాలి. తరువాత గింజలు తీసివేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చికొబ్బరి, గసగసాలను కలిపి పేస్టులా చేసుకోవాలి. స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి తరిగిన అల్లం వేసి వేగించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు పచ్చికొబ్బరి గసగసాల పేస్టు వేయాలి. తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. కొంచెం పసుపు, తగినంత కారం వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి కలియబెట్టుకోవాలి. మిశ్రమం మరుగుతున్న సమయంలో ఉసిరికాయ ముక్కలు వేయాలి. కాసేపు వేగించుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2020-11-28T21:35:23+05:30 IST