అరటికాయ కోఫ్తా

ABN , First Publish Date - 2020-02-15T16:26:32+05:30 IST

అరటికాయలు - రెండు, వెన్న - అర టీస్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, దాల్చినచెక్క పొడి - అర టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, అల్లం - చిన్న ముక్క, సోంపు పొడి - అర టీస్పూన్‌, గోధుమపిండి

అరటికాయ కోఫ్తా

కావలసినవి : అరటికాయలు - రెండు, వెన్న - అర టీస్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, దాల్చినచెక్క పొడి - అర టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, అల్లం - చిన్న ముక్క, సోంపు పొడి - అర టీస్పూన్‌, గోధుమపిండి - ఒక టీస్పూన్‌, మొక్కజొన్న పిండి - ఒక టీస్పూన్‌, జున్ను - 150 గ్రాములు, పచ్చిమిర్చి - నాలుగైదు, డ్రై అంజీరా - మూడు, దానిమ్మ గింజలు - అరకప్పు, నిమ్మకాయ - ఒకటి, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత.


తయారీ : అరటికాయలను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి.

తరువాత వాటిని చల్లటి నీటిలో వేసి పొట్టు తీసి, గుజ్జుగా చేయాలి.

ఒక పాన్‌ తీసుకుని అరటికాయ గుజ్జు వేసి, వెన్న, ఉప్పు వేసి కలపాలి.

యాలకుల పొడి, దాల్చినచెక్క పొడి, సోంపు పొడి వేయాలి. దాల్చిన చెక్కపొడి, అల్లంను దంచి వేసి కలియబెట్టాలి. కాసేపు వేగనిచ్చి దించాలి.

ఒక పాత్రలో జున్ను, అంజీరా ముక్కలు, పచ్చిమిర్చి, దానిమ్మగింజలు, నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి.

గోధుమపిండి, మొక్కజొన్నపిండి, వేగించి పెట్టుకున్న అరటికాయల గుజ్జు వేసి కలియబెట్టాలి.

ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ కోఫ్తాలుగా చేసుకుంటూ నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.

చట్నీతో తింటే అరటికాయ కోఫ్తాలు రుచిగా ఉంటాయి.

Updated Date - 2020-02-15T16:26:32+05:30 IST