బనానా కుర్మా

ABN , First Publish Date - 2020-02-15T17:22:15+05:30 IST

కావలసినవి : అరటికాయలు - ఎనిమిది, బంగాళదుంపలు - అరకేజీ, పెరుగు - పావుకేజీ, ఉల్లిపాయలు - రెండు, నూనె - సరిపడా, టొమాటోలు - నాలుగు, క్రీమ్‌ - 300గ్రాములు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - నాలుగైదు, జీలకర్ర - ఒక టీస్పూన్‌,

బనానా కుర్మా

కావలసినవి : అరటికాయలు - ఎనిమిది, బంగాళదుంపలు - అరకేజీ, పెరుగు - పావుకేజీ, ఉల్లిపాయలు - రెండు, నూనె - సరిపడా, టొమాటోలు - నాలుగు, క్రీమ్‌ - 300గ్రాములు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - నాలుగైదు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌. 


తయారీ : ఒక పాన్‌లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి.

తరువాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేయాలి. 

కాసేపు వేగిన తరువాత పెరుగు వేయాలి. 

బంగాళదుంప ముక్కలు, అరటికాయ ముక్కలు వేసి కలపాలి. ఇవి లేత గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి పావు గంటపాటు చిన్నమంటపై ఉడికించాలి. 

టొమోటోలు బాగా ఉడికిన తర్వాత రుచికి తగ్గ కారం వేయాలి. ఈ మిశ్రమంలో క్రీమ్‌ వేసి కలుపుకోవాలి.

చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి అన్నంతో లేదా చపాతీతో ఈ కుర్మాను తినొచ్చు.

Updated Date - 2020-02-15T17:22:15+05:30 IST