బీట్‌రూట్ కట్‌లెట్
ABN , First Publish Date - 2020-05-24T17:48:04+05:30 IST
బీట్‌రూట్స్ - చిన్నవి 2, పెద్ద బంగాళదుంప - 1, అల్లం తరుగు - ఒక టేబుల్ స్పూను, ఓట్స్ - అరకప్పు, ఆమ్‌చూర్ పొడి - పావు టీ స్పూను,
కావలసిన పదార్థాలు: బీట్‌రూట్స్ - చిన్నవి 2, పెద్ద బంగాళదుంప - 1, అల్లం తరుగు - ఒక టేబుల్ స్పూను, ఓట్స్ - అరకప్పు, ఆమ్‌చూర్ పొడి - పావు టీ స్పూను, కారం - అర టీ స్పూను, చాట్ మసాల - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత. గరం మసాల పొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: బీట్‌రూట్స్, బంగాళదుంప కుక్కర్లో ఉడికించి, చల్లారిన తర్వాత సన్నగా తురమాలి. ఓట్స్ మిక్సీలో బరకగా పొడి చేయాలి. ఒక పాత్రలో బీట్‌రూట్, బంగాళదుంప తురుము, ఓట్స్ పొడి, ఆమ్‌చూర్ పొడి, ఉప్పు, కారం, గరం మసాల, చాట్‌మసాల పొడులు వేసి ముద్దగా కలిపి 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత సమభాగాలుగా ఉండలు చేసి టిక్కీలుగా ఒత్తి పెనంపై నూనె రాసి, రెండువైపులా దోరగా వేగించాలి. వీటికి పుదీనా గ్రీన్ పచ్చడి మంచి కాంబినేషన్.