బీట్‌రూట్ అటుకులతో..
ABN , First Publish Date - 2020-10-03T17:03:28+05:30 IST
బీట్‌రూట్ - ఒక కప్పు, అటుకులు - ఒక కప్పు, కొబ్బరినూనె - రెండు టీస్పూన్‌లు, ఆవాలు - పావుటీస్పూన్, సెనగపప్పు - పావు టీస్పూన్,
కావలసినవి: బీట్‌రూట్ - ఒక కప్పు, అటుకులు - ఒక కప్పు, కొబ్బరినూనె - రెండు టీస్పూన్‌లు, ఆవాలు - పావుటీస్పూన్, సెనగపప్పు - పావు టీస్పూన్, మినప్పప్పు - పావు టీస్పూన్, అల్లం ముక్క - కొద్దిగా, ఎండుమిర్చి - నాలుగు, కరివేపాకు - కొంచెం, ఉప్పు - రుచికి తగినంత.
తయారీ విధానం: ముందుగా అటుకులు నానబెట్టుకోవాలి. తరువాత వడకట్టి ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలి. స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు వేసి వేగించాలి. తరువాత కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. అల్లం ముక్క వేసి పచ్చి వాసన పోయే దాకా వేగించుకోవాలి. బీట్‌రూట్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కాసేపు వేగిన తరువాత అటుకులు, తగినంత ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవాలి.