వంకాయ ఫ్రై

ABN , First Publish Date - 2020-10-17T18:35:01+05:30 IST

గ్రీన్‌ బ్రింజల్‌- పావుకిలో, నూనె- 50 ఎం.ఎల్‌, పచ్చిమిర్చి- 10గ్రా. కరివేపాకు- 5 గ్రా. అల్లంవెల్లుల్లి పేస్ట్‌- 20గ్రా. ఉప్పు- తగినంత, జీలకర్ర పొడి- 5 గ్రా. ఆవాలు- 2 గ్రా

వంకాయ ఫ్రై

కావలసినవి: గ్రీన్‌ బ్రింజల్‌- పావుకిలో, నూనె- 50 ఎం.ఎల్‌, పచ్చిమిర్చి- 10గ్రా. కరివేపాకు- 5 గ్రా. అల్లంవెల్లుల్లి పేస్ట్‌- 20గ్రా. ఉప్పు- తగినంత, జీలకర్ర పొడి- 5 గ్రా. ఆవాలు- 2 గ్రా. పసుపు- చిటికెడు, కారంపొడి- 50గ్రా. గరం మసాలా పొడి- 5 గ్రా, కొత్తిమీర- 2 గ్రా.


తయారీ విధానం: కడాయిలో నూనె వేగించాలి. జీలకర్ర, ఆవాలు వేసి వేగించాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. ఉప్పు, పసుపు వేసి వంకాయలు వేసి బాగా కలిపి మూడు నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించాలి. తరువాత కరివేపాకు, ఉప్పు, కారంపొడి, గరం మసాలా వేసి కలపాలి. రెండు నిమిషాలు ఉడికించిన తరువాత కొత్తిమీరతో గార్నిష్‌ చేసి వడ్డించాలి.

Updated Date - 2020-10-17T18:35:01+05:30 IST