బ్రింజల్ గ్రేవీ
ABN , First Publish Date - 2020-06-15T16:55:22+05:30 IST
పెద్ద వంకాయ - 1, టమోటాలు - 4, ఉల్లిపాయలు - 2, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్ స్పూను, చింతపండు - 20 గ్రా., ఆవాలు
కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయ - 1, టమోటాలు - 4, ఉల్లిపాయలు - 2, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్ స్పూను, చింతపండు - 20 గ్రా., ఆవాలు - ఒక టీ స్పూను, మిరియాలు - ఒక టేబుల్ స్పూను, బెల్లం పొడి - అర టేబుల్ స్పూను, పసుపు - పావు టీ స్పూను, కారం - పావు టీ స్పూను, నూనె - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అలంకరణకు.
తయారుచేసే విధానం: చింతపండు గుజ్జు తీయాలి. మిక్సీలో ఉల్లి, టమోటా తరుగు పేస్టు చేయాలి. కడాయిలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి వంకాయ ముక్కలు దోరగా వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో మిగతా నూనె వేసి ఆవాలు, మిరియాలు వేగించి ఉల్లి, టమోటా మిశ్రమం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి పచ్చివాసన పోయేవరకు వేగించాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు, ఉప్పు, కారం కలిపి మూత పెట్టి 15 నిమిషాలు అడుగంటకుండా ఉడికించాలి. తర్వాత బెల్లం కలిపి చివర్లో వేగించిన వంకాయ ముక్కలతో పాటు అరకప్పు నీరు పోసి ముక్కలు మెత్తబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. బిర్యానీ రైస్‌తో ఈ గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది.