కొత్తిమీర అటుకులు

ABN , First Publish Date - 2020-04-29T16:27:53+05:30 IST

మంచి రుచిగా ఉండే కొత్తిమీర అటుకులను ఎవరైనా ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం సులభం. ఉదయం టిఫిన్‌లా, సాయంత్రం స్నాక్‌గా తినొచ్చు.

కొత్తిమీర అటుకులు

ఆంధ్రజ్యోతి(29-04-2020):

మంచి రుచిగా ఉండే కొత్తిమీర అటుకులను ఎవరైనా ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం సులభం. ఉదయం టిఫిన్‌లా, సాయంత్రం స్నాక్‌గా తినొచ్చు. 


కావలసినవి: అటుకులు - 2 కప్పులు, పసుపు - పావు స్పూను, ఉప్పు - రుచికి తగినంత, తురిమిన తాజా కొబ్బరి - పావు కప్పు, పచ్చిమిరప - 2, కొత్తిమీర ఆకులు - ముప్పావు కప్పు, నిమ్మరసం - 1 1/2 స్పూను, రసం పౌడర్‌ - 1/2 స్పూను, పంచదార - స్పూను, ఆవాలు, మినప్పప్పు - 1 1/2 టేబుల్‌ స్పూను, దాల్చిన చెక్క - 1/2 స్పూను, కరివేపాకు, నూనె తగినంత, ఇంగువ - చిటికెడు 


తయారీ: ముందుగా అటుకులు కడిగి ఆరబెట్టండి. కొబ్బరి తురుము, కొత్తిమీర ఆకులు, పచ్చిమిర్చి, నిమ్మరసం, బెల్లం, ర సం పౌడర్‌ అన్నింటినీ కలపి కొంచెం నీరు జోడించి మెత్తగా రుబ్బండి. దీన్ని అటుకుల్లో కలిపి పక్కనపెట్టుకోండి. పొయ్యి మీద కడాయి ఉంచి ఆవాలు, మినప్పప్పు, దాల్చినచెక్కలను నూనెలో వేగించాలి. దానికి కరివేపాకు, ఇంగువ, పసుపు కలిపి కొద్దిగా వేగించి,  అటుకుల  మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసుకొని గరిటెతో బాగా కలపాలి. ఉప్పు  వే సుకొని ఒక్క నిమిషం ఉడకనిచ్చి దించుకోవాలి. కొత్తిమీర అటుకులు రెడీ. వెంటనే వేడివేడిగా వడ్డించాలి.

Updated Date - 2020-04-29T16:27:53+05:30 IST