కార్న్‌ కబాబ్‌

ABN , First Publish Date - 2020-07-25T18:05:06+05:30 IST

మొక్కజొన్నలు - రెండు కప్పులు, బంగాళదుంపలు - రెండు, జున్ను - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - రెండు,

కార్న్‌ కబాబ్‌

కావలసినవి: మొక్కజొన్నలు - రెండు  కప్పులు, బంగాళదుంపలు - రెండు, జున్ను - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - కొద్దిగా, నల్ల మిరియాల పొడి - అర టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌, తెల్ల మిరియాల పొడి - అరటీస్పూన్‌, జాపత్రి - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.


తయారీ: ముందుగా బంగాళదుంపలు ఉడికించి, గుజ్జుగా చేయాలి. ఒక పాత్రలో మొక్కజొన్నలు, బంగాళదుంపల గుజ్జు, జున్ను, తరిగిన పచ్చిమిర్చి, దంచిన అల్లం, నల్లమిరియాల పొడి, గరంమసాలా, తెల్లమిరియాల పొడి, జాపత్రి, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ కబాబ్‌లు చేయాలి. స్టవ్‌ పై పాన్‌ పెట్టి నూనె వేడి అయ్యాక కబాబ్‌లు వేసి చిన్న మంటపై గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. పుదీనా చట్నీతో వేడి వేడి కార్న్‌ కబాబ్స్‌ను చేసుకోవాలి.


Updated Date - 2020-07-25T18:05:06+05:30 IST