కార్న్‌ పనీర్‌ సమోసా

ABN , First Publish Date - 2020-09-12T18:23:55+05:30 IST

సాయంత్రం పూట చినుకులు పడుతుంటే వేడివేడిగా మిర్చీ, పకోడీ తినాలనిపిస్తుంది. అయితే ఈ సారి ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే మొక్కజొన్నతో సమోసా స్నాక్‌

కార్న్‌ పనీర్‌ సమోసా

సాయంత్రం పూట చినుకులు పడుతుంటే వేడివేడిగా మిర్చీ, పకోడీ తినాలనిపిస్తుంది. అయితే ఈ సారి ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే మొక్కజొన్నతో సమోసా స్నాక్‌ ట్రై చేయండి. సెలబ్రిటీ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ ఈ మధ్యే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ టేస్టీగా, క్రిస్పీ స్నాక్‌ తయారీ చూద్దాం...


కావలసినవి: ఉడికించిన స్వీట్‌కార్న్‌- సగం కప్పు, తరిగిన పనీర్‌- సగం కప్పు, చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి- రెండు, క్యాప్సికమ్‌ ఒకటి, కొత్తిమీర- రెండు టేబుల్‌ స్పూన్లు, ప్రాసెస్డ్‌ ఛీజ్‌- సగం కప్పు, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, సమోసా పట్టి, పిండి, నూనె, ఉప్పు తగినంత. 


విధానం: ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కార్న్‌, పనీర్‌ పేస్ట్‌, ఉల్లిపాయ, కాప్సికమ్‌, కొత్తిమీర, ప్రాసెస్డ్‌ ఛీజ్‌ పేస్ట్‌ వేసి బాగా కలపాలి. చివరలో రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు సమోసా పట్టి తీసుకొని మధ్యలో ఈ మిశ్రమాన్ని వేయాలి. సమోసా పట్టి అంచుల వెంబడి పేస్ట్‌లా చేసుకున్న పిండిని అద్దుతూ సమోసా ఆకారంలో మడవాలి. తరువాత కడాయిలో నూనె వేగించి, సమోసాలను వేగించాలి. ఈ టేస్టీ కార్న్‌ పనీర్‌ సమోసాలను కొత్తిమీర చట్నీతో తినాలి. 

Updated Date - 2020-09-12T18:23:55+05:30 IST