కట్‌లెట్స్
ABN , First Publish Date - 2020-07-04T19:01:26+05:30 IST
సేమ్యా - 200గ్రాములు, బంగాళదుంపలు - 200గ్రాములు, బియ్యప్పిండి - అరకప్పు, క్యారెట్ - రెండు, ఉల్లిపాయ - ఒకటి, గరంమసాలా - ఒక టీస్పూన్, కారం - రెండు టీస్పూన్లు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
కావలసినవి: సేమ్యా - 200గ్రాములు, బంగాళదుంపలు - 200గ్రాములు, బియ్యప్పిండి - అరకప్పు, క్యారెట్ - రెండు, ఉల్లిపాయ - ఒకటి, గరంమసాలా - ఒక టీస్పూన్, కారం - రెండు టీస్పూన్లు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారీ: ముందుగా బంగాళదుంపలను ఉడికించి గుజ్జుగా చేయాలి. ఒక పాత్రలో నీళ్లు తీసుకుని స్టవ్‌పై పెట్టి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో సేమ్యా వేసి, ఒక టీస్పూన్ నూనె వేయాలి. సేమ్యా మెత్తగా ఉడికిన తరువాత నీళ్లు తీసేసి సేమ్యాను ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో బంగాళదుంపలు, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కారం, బియ్యప్పిండి, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కట్‌లెట్స్‌గా చేసుకుంటూ నూనెలో డీప్ ఫ్రై చేయాలి. రెండు వైపులా గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. ఈ కట్‌లెట్స్‌ను టొమాటో కెచప్‌తో వేడి వేడిగా తింటే రుచిగా ఉంటాయి.