దహీ అంజీర్‌ కబాబ్‌

ABN , First Publish Date - 2020-02-22T18:25:40+05:30 IST

అంజీర్‌ - 100గ్రా., పెరుగు - 250గ్రా., పనీర్‌ - 400గ్రా., సెనగపిండి - 150గ్రా., బ్రెడ్‌ ముక్కలు - కొన్ని, అల్లం - చిన్నముక్క, పచ్చిమిర్చి - నాలుగు,

దహీ అంజీర్‌ కబాబ్‌

కావలసినవి : అంజీర్‌ - 100గ్రా., పెరుగు - 250గ్రా., పనీర్‌ - 400గ్రా., సెనగపిండి - 150గ్రా., బ్రెడ్‌ ముక్కలు - కొన్ని, అల్లం  - చిన్నముక్క, పచ్చిమిర్చి - నాలుగు, కొత్తిమీర - ఒకకట్ట, నెయ్యి - 200గ్రా., గరంమసాలా- ఒక టీస్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత. 


తయారీ : ఒక పాత్రలో పెరుగు తీసుకొని అందులో పనీర్‌, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరంమసాల, యాలకుల పొడి,  జీలకర్రపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతులోకి తీసుకుంటూ వేగించిన సెనగపిండి, బ్రెడ్‌ ముక్కలతో కలపాలి. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మధ్యలో అంజీర్‌ పెట్టి కబాబ్‌లుగా చేసుకోవాలి. ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చిన్నమంటపై ఈ కబాబ్‌లను గోధుమ వర్ణంలోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పుదీనా చట్నీ కాంబినేషన్‌లో ఇవి బాగుంటాయి.

Updated Date - 2020-02-22T18:25:40+05:30 IST