ఫయరీ రింగ్స్
ABN , First Publish Date - 2020-06-13T16:36:25+05:30 IST
ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, సెనగపిండి - మూడు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, బ్రెడ్ క్రంబ్స్ - మూడు టేబుల్‌స్పూన్లు
కావలసినవి: ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, సెనగపిండి - మూడు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, బ్రెడ్ క్రంబ్స్ - మూడు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - పావు టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, ఎండుమిర్చి - రెండు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారీ: ఒక పాత్రలో సెనగపిండి, బియ్యప్పిండి, తగినంత ఉప్పు, గరం మసాల, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్(ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి) వేసి, తగినన్ని నీళ్లు పోసి మిశ్రమంలా కలపాలి. బాగా గట్టిగా కాకుండా కాస్త నీళ్లలా ఉండేలా చూసుకోవాలి. ఉల్లిపాయలను గుండ్రంగా(రింగ్స్‌లా) కట్ చేసుకోవాలి. టొమాటోలను కూడా మధ్యలో భాగం తీసేసి చక్రాల్లా తరిగి పెట్టుకోవాలి. మరొక పాత్రలో బ్రెడ్ క్రంబ్స్ తీసుకుని, అందులో మిగిలిన చిల్లీ ఫ్లేక్స్ వేసి కలపాలి. ఇప్పుడు ఒక్కో ఉల్లిపాయ రింగ్‌ను తీసుకుని సెనగపిండి మిశ్రమంలో ముంచి తీస్తూ, బ్రెడ్ క్రంబ్స్ అద్దుకుంటూ ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక రింగ్స్ వేసుకొని వేగించాలి. ముదురు గోధుమ రంగులోకి మారే వరకు వేగించి తీసుకోవాలి. కెచప్‌తో వేడివేడిగా వడ్డించుకోవాలి.