గారెలు

ABN , First Publish Date - 2020-07-25T17:44:06+05:30 IST

ర్న్‌ - రెండు కప్పులు, జీలకర్ర - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, ఎండుమిర్చి - పది, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, పసుపు - చి

గారెలు

కావలసినవి: కార్న్‌ - రెండు కప్పులు, జీలకర్ర - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, ఎండుమిర్చి - పది, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, పసుపు - చిటికెడు, నూనె - సరిపడా.


తయారీ: గారెలకు స్వీట్‌కార్న్‌ కాకుండా మామూలువి తీసుకోవాలి. మొక్కజొన్నలు మరీ లేతగా ఉండకూడదు. అలాగనీ మరీ ముదిరిపోయినవి తీసుకోవద్దు. మొక్కజొన్నలు, జీలకర్ర, ధనియాల పొడి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి పట్టుకోవాలి. నీళ్లు పోయకుండా పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకొని కరివేపాకు, తగినంత ఉప్పు, పసుపు వేసి కలియబెట్టాలి. స్టవ్‌పై పాత్ర పెట్టి నూనె వేడి చేయాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ గారెలు నూనెలో వేసి వేగించాలి. గారెలు గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. ఈ గారెలు వేడి వేడిగా వడ్డించాలి.


Updated Date - 2020-07-25T17:44:06+05:30 IST