దొండకాయ బరడా

ABN , First Publish Date - 2020-10-31T17:30:40+05:30 IST

దొండకాయలు - పావుకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, పసుపు - కొద్దిగా, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి -రెండు టీస్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, కరివేపాకు

దొండకాయ బరడా

కావలసినవి: దొండకాయలు - పావుకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, పసుపు - కొద్దిగా, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి -రెండు టీస్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెబ్బలు, కొత్తిమీర - ఒక కట్ట, సెనగపిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: దొండకాయలను శుభ్రంగా కడిగి చక్రాలుగా కట్‌ చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరికాసేపు వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి. పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలియబెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి చిన్న మంటపై మగ్గనివ్వాలి. ముక్కలు ఉడికిన తరువాత సెనగపిండి వేసి ముక్కలకు పట్టేలా కలపాలి. సెనగపిండి వేగిన తరువాత కొత్తిమీర వేస్తే దొండకాయ బరడా రెడీ. 


దొండకాయలు

క్యాలరీలు - 18

కార్బోహైడ్రేట్లు - 3.55 గ్రా

ప్రోటీన్‌ - 1.57 గ్రా


జ్యోతి వలబోజు

8096310140


Updated Date - 2020-10-31T17:30:40+05:30 IST