పనస గింజల వడలు

ABN , First Publish Date - 2020-03-02T18:07:59+05:30 IST

పనస గింజలు - 2 కప్పులు, బియ్యప్పిండి - ఒక కప్పు, పచ్చిమిర్చి - 4, పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి

పనస గింజల వడలు

కావలసిన పదార్థాలు: పనస గింజలు - 2 కప్పులు, బియ్యప్పిండి - ఒక కప్పు, పచ్చిమిర్చి - 4, పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - పావుకప్పు, అల్లం తరుగు - ఒక టేబుల్‌ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా.


తయారుచేసే విధానం: పనస గింజల పై పొట్టు తీసి కుక్కర్లో ఉడికించాలి. మిక్సీలో చల్లారిన పనస గింజలు, అల్లం, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో ఉప్పు, కొత్తిమీర, ఉల్లితరుగు, బియ్యప్పిండి, జీలకర్ర వేసి బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంత కొంత తీసుకుని వడలుగా ఒత్తి కాగిన నూనెలో దోరగా రెండువైపులా వేగించుకోవాలి. ఇష్టమైనవారు ఇదే మిశ్రమాన్ని పకోడీగా కూడా వేసుకోవచ్చు. 

Updated Date - 2020-03-02T18:07:59+05:30 IST