మిల్లెట్‌ దోశ

ABN , First Publish Date - 2020-03-15T16:10:22+05:30 IST

ఊదలు - అరకప్పు, మినప్పప్పు - నాలుగు టేబుల్‌స్పూన్లు, టొమాటోలు - రెండు, ఎండుమిర్చి - నాలుగు, కందిపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.

మిల్లెట్‌ దోశ

కావలసినవి :

ఊదలు - అరకప్పు, మినప్పప్పు - నాలుగు టేబుల్‌స్పూన్లు, టొమాటోలు - రెండు, ఎండుమిర్చి - నాలుగు, కందిపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.

తయారీ :

ఊదలు, మినప్పప్పు, కందిపప్పును శుభ్రంగా కడిగి మూడు గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీళ్లను తీసేసి, ఎండుమిర్చి వేసి మిక్సీలో గ్రైండ్‌ చేయాలి. టొమాటోలను ముక్కలుగా కట్‌ చేసి వేసి మరొకసారి గ్రైండ్‌ చేసి పేస్టులా పట్టుకోవాలి. దోశలు వేసుకునేందుకు అనువుగా పిండి కాస్త పలుచగా ఉండేలా చూసుకోవాలి.  తగినంత ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు కట్‌ చేసి వేసుకుని కలియబెట్టాలి. పెనం స్టవ్‌పై పెట్టి కాస్త వేడి అయ్యాక దోశలు వేయాలి. రెండు వైపులా కాల్చి వేడివేడిగా పిల్లలకు అందించాలి.

Updated Date - 2020-03-15T16:10:22+05:30 IST