మినీ సోయా ఊతప్పం
ABN , First Publish Date - 2020-04-30T14:24:38+05:30 IST
1/2 కప్పు సోయా మిల్క్,1 కప్పు సెమోలినా రవ్వ, సన్నగా తరిగిన ఉల్లి, టమోటా 1/2 కప్పు చొప్పున, కొత్తిమేర, పచ్చిమిర్చి 2 చెంచాలు చొప్పున, రుచికి తగినంత ఉప్పు, నూనె.
కావల్సిన పదార్థాలు: 1/2 కప్పు సోయా మిల్క్,1 కప్పు సెమోలినా రవ్వ, సన్నగా తరిగిన ఉల్లి, టమోటా 1/2 కప్పు చొప్పున, కొత్తిమేర, పచ్చిమిర్చి 2 చెంచాలు చొప్పున, రుచికి తగినంత ఉప్పు, నూనె.
తయారీ విధానం: సోయా మిల్క్, సెమోలినా ఒక బౌల్‌లో పోసి, బాగా కలపాలి. పది నిమిషాల తరువాత కట్ చేసిన ఉల్లి, టమోటా, కొత్తిమేర, పచ్చిమిర్చితో పాటు ఉప్పు వేసి మళ్లీ కలపాలి. స్టౌవ్‌పై తవా పెట్టి, వేడెక్కిన తరువాత దానిపై నూనె రాయాలి. గరిటెతో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మూడు ఇంచుల వృత్తాకారంలో తవాపై వేయండి. ఒకేసారి మూడు.. నాలుగు ఊతప్పాలు చేసుకోవచ్చు. ఒకవైపు కాలిన తరువాత ఊతప్పాన్ని రెండో వైపు తిప్పి, కాస్త నూనె వేసి, కాల్చాలి.