ఓట్స్‌ చాట్‌

ABN , First Publish Date - 2020-03-15T16:03:11+05:30 IST

ఓట్స్‌ - పావు కప్పు, పెరుగు - మూడు టేబుల్‌స్పూన్లు, దానిమ్మగింజలు - ఒక టేబుల్‌స్పూన్‌, చాట్‌ మసాలా - పావు టీస్పూన్‌, జీలకర్రపొడి - అరటీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత,

ఓట్స్‌ చాట్‌

కావలసినవి :

ఓట్స్‌ - పావు కప్పు, పెరుగు - మూడు టేబుల్‌స్పూన్లు, దానిమ్మగింజలు - ఒక టేబుల్‌స్పూన్‌, చాట్‌ మసాలా - పావు టీస్పూన్‌, జీలకర్రపొడి - అరటీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - కొద్దిగా, గ్రీన్‌చట్నీ - టీస్పూన్‌, స్వీట్‌చట్నీ - టీస్పూన్‌, కారప్పూస - ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ :

స్టవ్‌పై పాన్‌ పెట్టి ఓట్స్‌ను చిన్నమంటపై వేగించాలి. ఒక పాత్రలో పెరుగు, చాట్‌ మసాలా, జీలకర్రపొడి వేసి కలపాలి. స్వీట్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీ వేసి కలియబెట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేగించిన ఓట్స్‌లో వేసి కలపాలి. నిమ్మ గింజలు, కొత్తిమీర, కారప్పూసతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-03-15T16:03:11+05:30 IST