పకోడి
ABN , First Publish Date - 2020-07-25T18:14:57+05:30 IST
స్వీట్ కార్న్ - ఒకటిన్నర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, జీలకర్ర - అర టీస్పూన్, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు
కావలసినవి: స్వీట్ కార్న్ - ఒకటిన్నర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, జీలకర్ర - అర టీస్పూన్, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - అర టీస్పూన్, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్, నూనె - సరిపడా.
తయారీ: కార్న్‌ను మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా చూసుకోవాలి. తరువాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, సెనగపిండి తగినంత ఉప్పు, గరంమసాలా, బియ్యప్పిండి, కారం వేసి బాగా కలపాలి. మిశ్రమం మరీ మెత్తగా ఉండకూడదు. ఒకవేళ మెత్తగా అయితే కొద్దిగా బియ్యప్పిండి కలపాలి. స్టవ్‌పై పాత్ర పెట్టి నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చిన్నమంటపై వేగించాలి. ఈ వేడి వేడి కార్న్ పకోడి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.