పనీర్‌ టిక్కా

ABN , First Publish Date - 2020-08-29T20:59:04+05:30 IST

పనీర్‌ - అరకేజీ, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిర్చి - రెండు, పెరుగు - పావు

పనీర్‌ టిక్కా

కావలసినవి: పనీర్‌ - అరకేజీ, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిర్చి - రెండు, పెరుగు - పావు కప్పు, తెల్లనువ్వులు - పావు కప్పు, నిమ్మకాయ - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి. 


తయారీ: ఓవెన్‌ను 204 డిగ్రీల సెల్సియస్‌కు ప్రీ హీట్‌ చేసుకోవాలి. నువ్వులను వేగించి పక్కన పెట్టుకోవాలి. పనీర్‌ చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని ఒక పాన్‌లోకి తీసుకోవాలి. తరువాత అందులో పెరుగు, నువ్వులు, అల్లంవెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రీ హీట్‌ చేసుకున్న ఓవెన్‌లో పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి. నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్‌ చేయాలి.

Updated Date - 2020-08-29T20:59:04+05:30 IST