పెసర పునుకులు

ABN , First Publish Date - 2020-08-14T19:22:57+05:30 IST

పెసరపప్పు - ఒక కప్పు, మినపప్పు - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - అరకప్పు,

పెసర పునుకులు

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - ఒక కప్పు, మినపప్పు - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర - ఒక టీ స్పూను, అల్లం - రెండంగుళాల ముక్క, నూనె - వేగించడానికి సరిపడా. 


తయారుచేసే విధానం: పెసరపప్పు, మినప్పప్పు కలిపి 3 గంటలు నానబెట్టి నీరు వడకట్టాలి. తర్వాత పప్పుల్లో అల్లం ముక్కలు వేసి గట్టిగా పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టులో ఉప్పు, ఉల్లి తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. తర్వాత బాగా కాగిన నూనెలో తడి చేత్తో పిండిని పునుకులుగా వేసి దోరగా వేగించాలి. వీటికి నిమ్మకాయ పచ్చడి మంచి కాంబినేషన్‌.

Updated Date - 2020-08-14T19:22:57+05:30 IST