పెసరపప్పు ఇడ్లీ

ABN , First Publish Date - 2020-07-11T18:51:21+05:30 IST

పెసరపప్పు - ఒక కప్పు, పెరుగు - పావు కప్పు, నూనె - కొద్దిగా, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, అల్లం ముక్క - కొద్దిగా,

పెసరపప్పు ఇడ్లీ

కావలసినవి: పెసరపప్పు - ఒక కప్పు, పెరుగు - పావు కప్పు, నూనె - కొద్దిగా, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, అల్లం ముక్క - కొద్దిగా, కరివేపాకు - రెండు రెమ్మలు, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, క్యారెట్‌ - ఒకటి, ఇంగువ - చిటికెడు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, బేకింగ్‌ సోడా - కొద్దిగా.


తయారీ: ముందుగా పెసరపప్పును రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత నీళ్లు తీసేసి మెత్తటి  పేస్టులా చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇందులో పెరుగు వేసి కలపాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. తరువాత సెనగపప్పు, మిర్చి, అల్లం ముక్క, కరివేపాకు, జీడిపప్పు వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు క్యారెట్‌ తురుము వేసి ఇంకాసేపు వేగించాలి. ఈ మిశ్రమాన్ని పెసరపప్పు మిశ్రమంలో వేసి కలపాలి. ఇంగువ, కొత్తిమీర, తగినంత ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి. తరువాత ఇడ్లీ పాత్రలో వేసి కుక్కర్‌లో పావుగంటపాటు చిన్నమంటపై ఉడికించాలి. చట్నీతో లేక సాంబారుతో వీటిని తింటే రుచితో పాటు రోగనిరోధక శక్తిని కూడా అందిస్తాయి

Updated Date - 2020-07-11T18:51:21+05:30 IST