పొటాటో లాలీపాప్స్‌

ABN , First Publish Date - 2020-06-13T16:28:21+05:30 IST

బంగాళదుంపలు - రెండు, బ్రెడ్‌ ప్యాకెట్‌ - ఒకటి(చిన్నది), కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి

పొటాటో లాలీపాప్స్‌

కావలసినవి: బంగాళదుంపలు - రెండు, బ్రెడ్‌ ప్యాకెట్‌ - ఒకటి(చిన్నది), కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, ఛాట్‌మసాలా - అర టీస్పూన్‌, మైదా - ఒక టేబుల్‌స్పూన్‌, కరివేపాకు - కొద్దిగా,  నిమ్మకాయ - ఒకటి, పసుపు - అర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత. 


తయారీ: ముందుగా పెద్ద సైజులో ఉండే రెండు బంగాళదుంపలను ఉడికించాలి. తరువాత వాటి పొట్టు తీసి బౌల్‌లోకి తీసుకొని గుజ్జుగా చేసుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను తీసుకొని ముక్కలుగా కట్‌ చేసి, మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప గుజ్జు ఉన్న పాత్ర తీసుకొని అందులో ఒక కప్పు బ్రెడ్‌ క్రంబ్స్‌ వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒకస్పూన్‌ అల్లంవెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్రపొడి, ఛాట్‌ మసాల వేసి, ఒక టీస్పూన్‌ నిమ్మరసం పిండుకొని కలపాలి. మరొక పాత్రలో ఒక టేబుల్‌స్పూన్‌ మైదా తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకొని మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్‌లా చుట్టుకోవాలి. వీటిని మైదా నీళ్లలో ముంచుకుంటూ మిగిలిన్‌ బ్రెడ్‌ క్రంబ్స్‌ని అద్దుకోవాలి. ఒకపాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేగించాలి. ఎక్కువ సేపు వేగించకుండా రెండు, మూడు నిమిషాల పాటు వేగించుకుంటే సరిపోతుంది. పొటాటో లాలీపాప్స్‌కి టూత్‌పిక్స్‌ గుచ్చి సర్వ్‌ చేసుకోవాలి. 

Updated Date - 2020-06-13T16:28:21+05:30 IST