బంగాళదుంప యోగర్ట్‌

ABN , First Publish Date - 2020-03-21T15:43:50+05:30 IST

బంగాళదుంపలను ఉడికించాలి. తరువాత పొట్టు తీసి సన్నటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పాత్రలో బంగాళదుంపల్ని వేసి, పెరుగు పోయాలి. స్టవ్‌పై పాన్‌లో నూనె పోసి కాస్త వేడయ్యాక

బంగాళదుంప యోగర్ట్‌

కావలసినవి: బంగాళదుంపలు - అరకేజీ, పెరుగు - 200ఎంఎల్‌, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - టీస్పూన్‌, ఆవాలు - టీస్పూన్‌, ఉప్పు - తగినంత, ఉల్లిపాయలు - రెండు, పైనాపిల్‌ ముక్కలు - కొన్ని, పుదీనా - కొద్దిగా, పచ్చిమిర్చి - రెండు, బ్రెడ్‌ముక్కలు - నాలుగు.


తయారీ: బంగాళదుంపలను ఉడికించాలి. తరువాత పొట్టు తీసి సన్నటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పాత్రలో బంగాళదుంపల్ని వేసి, పెరుగు పోయాలి. స్టవ్‌పై పాన్‌లో నూనె పోసి కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. ఈ పోపుని బంగాళదుంపల ముక్కలపై పోయాలి. ఉల్లిపాయలు, పైనాపిక్‌ ముక్కలు వేయాలి. బ్రెడ్‌ ముక్కలు పొడిపొడిగా చేసి చల్లాలి. పచ్చిమిర్చి సన్నగా తరిగి వేయాలి. పుదీనాతో గార్నిష్‌ చేయాలి. తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2020-03-21T15:43:50+05:30 IST