ప్రసాదం పులిహోర

ABN , First Publish Date - 2020-06-29T18:49:39+05:30 IST

ఉడికించి చల్లార్చిన పొడి అన్నం - రెండు కప్పులు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు - ఒక్కో టీ స్పూను చొప్పున, వేగించిన వేరుశనగలు - గుప్పెడు, ఎండుమిర్చి - 2, చీరిన పచ్చిమిర్చి

ప్రసాదం పులిహోర

కావలసిన పదార్థాలు: ఉడికించి చల్లార్చిన పొడి అన్నం - రెండు కప్పులు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు - ఒక్కో టీ స్పూను చొప్పున, వేగించిన వేరుశనగలు - గుప్పెడు, ఎండుమిర్చి - 2, చీరిన పచ్చిమిర్చి - 2, పసుపు - ఒక టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఉప్పు - రుచికి సరిపడా, బెల్లం - ఒక టీ స్పూను, చింతపండు గుజ్జు నీరు - ఒక కప్పు. పొడికోసం : ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, నువ్వులు - ఒక్కో టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి - 2. 


తయారుచేసే విధానం: కడాయిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు ఒకటి తర్వాత ఒకటి వేగించి చింతపండు నీరుపోయాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, బెల్లం వేసి మరిగించాలి. నూనె పైకి తేలిన తర్వాత వేగించి చేసుకున్న దినుసుల పొడి కలిపి రెండు నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు అన్నం వేసి బాగా కలిపి పైనుంచి రుచికోసం కొద్దిగా ఉప్పు చల్లి దించేసి సర్వ్‌ చేయాలి. 

Updated Date - 2020-06-29T18:49:39+05:30 IST