గుమ్మడికాయ బరడా

ABN , First Publish Date - 2020-10-31T17:45:22+05:30 IST

గుమ్మడికాయ ముక్కలు - పావుకేజీ, సెనగపప్పు - 100గ్రా, పెసరపప్పు - 25గ్రా, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, పసుపు - పావు టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, జీలకర్ర

గుమ్మడికాయ బరడా

కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు - పావుకేజీ, సెనగపప్పు - 100గ్రా, పెసరపప్పు - 25గ్రా, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, పసుపు - పావు టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, ఆవాలు - అర టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: సెనగపప్పు, పెసరపప్పును గోధుమరవ్వ మాదిరిగా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టవ్‌పై బాణలి పెట్టి నూనె పోయాలి. కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కలపాలి. ఇప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా తరిగిన గుమ్మడికాయ ముక్కలు వేసి, పసుపు వేసి కలియబెట్టాలి. గుమ్మడికాయ ముక్కలు మగ్గిన తరువాత రెండు గ్లాసుల నీళ్లు పోయాలి.  తగినంత ఉప్పు, కారం వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు గ్రైండ్‌ చేసి పెట్టుకున్న బరడా పొడి వేయాలి. చివరగా కొత్తిమీర వేసి దింపాలి. వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు ఈ బరడా కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.


వంద గ్రాముల గుమ్మడికాయలో పోషకాల విలువలు


క్యాలరీలు - 26

పొటాషియం - 340 గ్రా

కార్బోహైడ్రేట్లు - 7 గ్రా

ప్రోటీన్‌ - 1 గ్రా

Updated Date - 2020-10-31T17:45:22+05:30 IST