సగ్గుబియ్యం గ్రీన్ కిచిడి

ABN , First Publish Date - 2020-05-19T18:07:27+05:30 IST

సగ్గుబియ్యం - ఒక కప్పు, పల్లీల పొడి - పావు కప్పు, పంచదార - ఒక టీ స్పూను,

సగ్గుబియ్యం గ్రీన్ కిచిడి

కావలసిన పదార్థాలు : సగ్గుబియ్యం - ఒక కప్పు, పల్లీల పొడి - పావు కప్పు, పంచదార - ఒక టీ స్పూను, ఉప్పు - ఒక టీ స్పూను, కొత్తిమీర తరుగు - ఒక కప్పు, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 2, నెయ్యి - ఒక టేబుల్‌ స్పూను, జీలకర్ర - ఒక టీ స్పూను, పల్లీలు - ఒక టేబుల్‌ స్పూను, ఉడికించిన బంగాళదుంప - అర కప్పు ముక్కలు, నిమ్మరసం - ఒక టేబుల్‌ స్పూను.


తయారుచేసే విధానం: సగ్గుబియ్యాన్ని బాగా కడిగి ముప్పావు కప్పు నీటిలో 6 గంటలు నానబెట్టాలి. తర్వాత ఒక పాత్రలో వేసి పల్లీ పొడి, ఉప్పు, పంచదార వేసి కలపాలి. కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి బరకగా మిక్సీ పట్టాలి. మూకుడులో నెయ్యి వేసి జీలకర్ర, పల్లీలు వేగించి, కొత్తిమీర మిశ్రమం, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత సగ్గుబియ్యం కలిపి మూతపెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. తర్వాత నిమ్మరసం, కొత్తిమీర చల్లి సర్వ్‌ చేయాలి. 


Updated Date - 2020-05-19T18:07:27+05:30 IST