శాండ్‌విచ్‌

ABN , First Publish Date - 2020-08-15T18:49:04+05:30 IST

బ్రెడ్‌ ముక్కలు - ఆరు, వెన్న - కొద్దిగా, పుదీనా చట్నీ - రెండు టేబుల్‌స్పూన్లు, పనీర్‌ - అరకప్పు, క్యారెట్లు - రెండు,

శాండ్‌విచ్‌

కావలసినవి: బ్రెడ్‌ ముక్కలు - ఆరు, వెన్న - కొద్దిగా, పుదీనా చట్నీ - రెండు టేబుల్‌స్పూన్లు, పనీర్‌ - అరకప్పు, క్యారెట్లు - రెండు, మయోనైజ్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, టొమాటో కెచప్‌ - కొద్దిగా.


తయారీ: ముందుగా బ్రెడ్‌ ముక్కలకు వెన్న  రాసి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్‌ తీసుకుని అందులో కొద్దిగా పనీర్‌ తురుము వేయాలి. అందులో పుదీనా చట్నీ వేసి కలపాలి. మరొక చిన్న బౌల్‌లో క్యారెట్‌ తురుము తీసుకోవాలి. అందులో మయోనైజ్‌ వేసి కలపాలి. ఇప్పుడు బ్రెడ్‌ స్లైస్‌పై పుదీనా చట్నీ మిశ్రమాన్ని ఒక లేయర్‌గా రాసి పైన మరొక బ్రెడ్‌ స్లైస్‌ పెట్టాలి. చివరగా ఆ బ్రెడ్‌ స్లైస్‌పై క్యారెట్‌ తురుము మిశ్రమాన్ని లేయర్‌గా వేసి మరొక బ్రెడ్‌ స్లైస్‌ను పైన పెట్టుకోవాలి. టొమాటో కెచప్‌తో సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-08-15T18:49:04+05:30 IST