సేమియా కట్‌ లెట్‌

ABN , First Publish Date - 2020-10-22T21:53:04+05:30 IST

సేమియా - అరకప్పు, కార్న్‌ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, ఉడికించిన బంగాళదుంప గుజ్జు - ఒక కప్పు,

సేమియా కట్‌ లెట్‌

కావలసిన పదార్థాలు: సేమియా - అరకప్పు, కార్న్‌ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, ఉడికించిన బంగాళదుంప గుజ్జు - ఒక కప్పు, అల్లం, మిర్చి తరుగు - ఒక టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి తరుగు - అర టీ స్పూను,  జీరా, గరం మసాల, చాట్‌ మసాల పొడులు - అర టీ స్పూను చొప్పున, బ్రెడ్‌ పొడి - అరకప్పు, కొత్తిమీర తరుగు - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేగించడానికి సరిపడా., మైదా - అరకప్పు, మిరియాల పొడి - చిటికెడు. 


తయారుచేసే విధానం: సేమియాలో రెండు టీ స్పూన్లు నూనె వేసి దోరగా వేగించాలి. తర్వాత చిటికెడు ఉప్పు కలిపిన 4 కప్పుల మరిగే నీటిలో వేసి పలుకుమీద ఉడికించి దించేసి వడకట్టాలి. మిక్సింగ్‌ బౌల్‌లో సేమియా, బంగాళదుంప గుజ్జు, అల్లం, మిర్చి తరుగు, కొత్తిమీర, ఎండుమిర్చి తరుగు, జీరా, గరంమసాల, చాట్‌ మసాల పొడులు, బ్రెడ్‌ పొడి, ఉప్పు వేసి బాగా కలిపి ముద్దగా చేయాలి. ఈ ముద్దలోంచి కొంత కొంత మిశ్రమం తీసుకుని మీకు నచ్చిన లేదా సిలిండ్రికల్‌  షేపులో ఒత్తుకోవాలి. ఒక కప్పు నీటిలో ఉప్పు, మిరియాల పొడి, మైదా కలిపి జారుగా బాటర్‌ తయారుచేయాలి. సేమియా కట్‌లెట్స్‌ని బాటర్‌లో ముంచి విడి సేమియాలో దొర్లించి నూనెలో దోరగా వేగించాలి. వీటికి టమోటా సాస్‌ మంచి కాంబినేషన్‌.

Updated Date - 2020-10-22T21:53:04+05:30 IST