శొంఠి లడ్డూ
ABN , First Publish Date - 2020-07-11T18:29:13+05:30 IST
నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్, బెల్లం - పావు కప్పు, పసుపు - అర టేబుల్‌స్పూన్, శొంఠి పొడి - అర టేబుల్‌స్పూన్, దాల్చినచెక్క పొడి
కావలసినవి: నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్, బెల్లం - పావు కప్పు, పసుపు - అర టేబుల్‌స్పూన్, శొంఠి పొడి - అర టేబుల్‌స్పూన్, దాల్చినచెక్క పొడి - అర టీస్పూన్.
తయారీ: స్టవ్‌పై పాన్ పెట్టి నెయ్యి వేయాలి. మంట చిన్నగా పెట్టుకోవాలి. తరువాత బెల్లం వేసి కలుపుకోవాలి. రెండు బాగా కలిసి చిక్కటి మిశ్రమంలా తయారయ్యేలా కలుపుకోవాలి. ఒక పాత్రలో పసుపు, శొంఠి పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం మిశ్రమంలో వేసి కలియబెట్టాలి. మిశ్రమం కాస్త చల్లారిన తరువాత చిన్న చిన్న లడ్డూలుగా చేయాలి. ఇవి నిల్వ ఉంటాయి. పిల్లలు సైతం ఇష్టంగా తింటారు.