పాలకూర బరడా

ABN , First Publish Date - 2020-10-31T17:55:36+05:30 IST

పాలకూర - మూడు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - రెండు

పాలకూర బరడా

కావలసినవి: పాలకూర - మూడు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - రెండు రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, గరంమసాలా - పావు టీస్పూన్‌, సెనగపిండి - పావు కప్పు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేగించాలి. తరువాత పసుపు, అల్లం  వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి కలపాలి. ఇప్పుడు పాలకూర, తగినంత ఉప్పు, కారం వేసి కలియబెట్టాలి. పాలకూర మగ్గి నీరంతా పోయిన తరువాత సెనగపిండి, ధనియాల పొడి వేసి కలిపి మూతపెట్టి మరికాసేపు వేగనివ్వాలి. చివరగా గరంమసాలా వేసి దింపాలి. 


పాలకూర


క్యాలరీలు -  23

కార్బోహైడ్రేట్లు -  3.8గ్రా

ప్రోటీన్లు -  3గ్రా

ఫైబర్‌ -  2.2గ్రా

Updated Date - 2020-10-31T17:55:36+05:30 IST