పాలకూర పలావ్‌

ABN , First Publish Date - 2020-06-03T16:06:40+05:30 IST

పాలకూర - 300 గ్రా, రైస్‌ - కప్పు, ఉప్పు - తగినంత, చిన్న టొమాటో - 1, పల్లీలు - అరకప్పు (పొడి చేసుకోవాలి), నూనె - సరిపడా, పసుపు - చిటికెడు, నీళ్లు - సరిపడా.

పాలకూర పలావ్‌

కావలసినవి: పాలకూర -  300 గ్రా, రైస్‌ - కప్పు, ఉప్పు - తగినంత, చిన్న టొమాటో - 1, పల్లీలు - అరకప్పు (పొడి చేసుకోవాలి), నూనె - సరిపడా, పసుపు - చిటికెడు, నీళ్లు - సరిపడా.


తయారీ: ముందుగా పాలకూర ఆకులను కడిగి, ముక్కలుగా తరిగి దోరగా వేగించి పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసి, టొమాటోతో కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. తరువాత అన్నం వండి, కడాయిలోకి తీసుకోవాలి. అందులో పాలకూర, టొమాటో పేస్టు, ఉప్పు వేసి పొయ్యి మీద ఉడికిస్తూ బాగా కలపాలి. అంతే పాలకూర పలావ్‌ రెడీ. పల్లీపొడి, కూర లేదా రైతాతో తింటే రుచిగా ఉంటుంది.




Updated Date - 2020-06-03T16:06:40+05:30 IST