కంద నిమ్మకూర
ABN , First Publish Date - 2020-09-09T21:03:36+05:30 IST
కంద గడ్డ - 300 గ్రా., ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - అర టీ స్పూను, పచ్చిమిర్చి - 4, కరివేపాకు - 4 రెబ్బలు, నిమ్మకాయలు - 2, ఆవాలు, మినప్పప్పు,
కావలసిన పదార్థాలు: కంద గడ్డ - 300 గ్రా., ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - అర టీ స్పూను, పచ్చిమిర్చి - 4, కరివేపాకు - 4 రెబ్బలు, నిమ్మకాయలు - 2, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇంగువ - పోపు సరిపడా, నూనె - ఒక టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం: కంద చెక్కు తీసి, శుభ్రం చేసి ముక్కలుగా తరిగి మునిగేవరకు నీరు పోసి స్టవ్ మీద ఉంచాలి. ఒక పొంగు రాగానే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ముక్కలు ఉడికించి దించేయాలి. మిగిలిన నీరు ఒంపి కంద ముక్కల్లో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. ఉప్పు సరిపడా వేసి, నిమ్మరసం పిండాలి. తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చితో నూనెలో తాలింపు వేసుకుని కంద మిశ్రమంలో కలపాలి. ఈ కూర అన్నంతో పాటు దోశల్లోకి కూడా బావుంటుంది.