వెర్మిసెల్లీ బైట్స్
ABN , First Publish Date - 2020-07-04T18:34:32+05:30 IST
సేమ్యా - రెండు కప్పులు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, కండెన్స్‌డ్ మిల్క్ - అరకప్పు, కొబ్బరి తురుము - పావు కప్పు, ప్లాస్టిక్ టీకప్పు - ఒకటి, జీడిపప్పు - ఐదారు పలుకులు.
కావలసినవి: సేమ్యా - రెండు కప్పులు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, కండెన్స్‌డ్ మిల్క్ - అరకప్పు, కొబ్బరి తురుము - పావు కప్పు, ప్లాస్టిక్ టీకప్పు - ఒకటి, జీడిపప్పు - ఐదారు పలుకులు.
తయారీ: స్టవ్‌పై ఒక పాన్ పెట్టి నెయ్యి వేసి, కాస్త వేడి అయ్యాక సేమ్యా వేసి వేగించాలి. తరువాత కొబ్బరి తురుము వేసి కలపాలి. జీడిపప్పు పలుకులను దంచి వేయాలి. కండెన్స్‌డ్ మిల్క్ వేసి కలిపి ఐదారు నిమిషాల పాటు చిన్నమంటపై వేగనివ్వాలి. మిశ్రమాన్ని చల్లారినివ్వాలి. తరువాత చేతికి కాస్త నూనె రాసుకుని వెర్మిసెల్లీని చిన్న ప్లాస్టిక్ టీకప్పులో వేస్తూ గట్టిగా ఒత్తాలి. షేప్ సరిగ్గా ఉండేలా చూసుకుంటూ ప్లేట్‌లో వేయాలి. అంతే.. వెర్మిసెల్లీ బైట్స్ రెడీ. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.